: భారత యువతను సానబెడితే ఇక మనకు తిరుగుండదు: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా


భారత యువతను సానబెడితే ఇక మన దేశానికి తిరుగుండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పూణెలో ఈరోజు ప్రమోద్ మహాజన్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ప్రిన్యూర్ మిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయక పోవడం వల్లే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య బాగా పెరిగిపోయిందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పారద్రోలేందుకే స్టాండ్ అప్ ఇండియా, ముద్రా బ్యాంక్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. ఏ దేశానికీ లేనంత యువ జనాభా ఇక్కడ ఉండటం భారత్ అదృష్టమని అమిత్ షా అన్నారు.

  • Loading...

More Telugu News