: అమెరికా వెళ్లడం ఇక మరింత ఈజీ!
అమెరికాతో 'గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్'పై ఒప్పందం కుదరడంతో, విమానాశ్రయాల్లో స్వల్ప తనిఖీలతోనే ఇండియన్స్ సులువుగా ఆ దేశంలోకి ప్రవేశించే వీలు కలుగనుంది. ఇటీవలి కాలంలో వీసా విధానం కఠినం కావడం, విద్యార్జన నిమిత్తం వెళుతున్న ఎంతో మందిని పలు ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కుదుర్చుకోవాలని భావించిన ఇండియా, అందుకు తగ్గ పావులు కదిపింది. యూఎస్ లో భారత రాయబారి అరుణ్ సింగ్, అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిప్యూటీ కమిషనర్ కెవిన్ మెక్ అలీసన్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ డీల్ అమలుకు మరికొంత సమయం పడుతుందని తెలుస్తుండగా, అమెరికాతో ఈ తరహా డీల్ కుదుర్చుకున్న తొమ్మిదో దేశం ఇండియా.