: పాతపాటే పాడిన పాకిస్థాన్... దావూద్ వాళ్ల దేశంలో లేడట!


పాకిస్థాన్ మళ్లీ పాత పాట పాడింది. 1993 వరుస ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని బుకాయించింది. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోంచి ఫోన్లో తన అనుచరులకు ఆదేశాలిస్తున్నాడని యూపీకి చెందిన ఓ యువ హ్యాకర్ ఇప్పటికే వెల్లడించగా, ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో పాకిస్థాన్ లో దావూద్ ఇబ్రహీం నివాసం బట్టబయలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తమ దేశంలో దావూద్ లేడని పాక్ బుకాయిస్తోంది. తమ దేశంలో లేని వ్యక్తిని ఎలా అప్పగించగలమని ప్రశ్నిస్తోంది. కాగా, తమ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడతాయనే భయం అక్కర్లేదని పాక్ అధికారులు తేల్చిచెప్పారు. అవి పూర్తి భద్రతతో సరైన చోట ఉన్నాయని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News