: అహ్మదాబాద్‌లో భారీ చోరీ.. రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు దోపిడి
దాదాపు రూ.5 కోట్ల విలువైన వస్తువులు దోపిడీకి గురయిన ఘటన ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. అక్కడి ఇష్వార్ బెచార్ అంగాడియా కొరియర్ సంస్థకు చెందిన ట్రక్ నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల విలువచేసే బంగారం, వెండి వస్తువులను దుండగులు దొంగిలించారు. కొరియర్ సంస్థ ట్రక్ అహ్మదాబాద్ నుంచి రాజ్‌కోట్‌కు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యంలో పలువురు దండగులు దాన్ని అడ్డగించి సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. తమతో తెచ్చుకున్న కారులో ట్రక్‌లోని బంగారం, వెండిని వేసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.