: టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న మహిళను బెదిరించి టీటీఈ అత్యాచారం


టికెట్ లేకుండా ప్రయాణం చేస్తోందన్న కారణంతో ఓ మహిళపై ట్రైన్ లో టీటీఈ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...ఇంట్లో చెప్పకుండా మే 29న ఓ యువతి బరేలీ నుంచి జైపూర్ వెళ్తున్న హజ్రత్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేసింది. ఆమె చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో టికెట్ తీయకుండానే ట్రైన్ ఎక్కేసింది. ట్రైన్ హపూర్ వద్దకు వచ్చేసరికి రైల్లోకి రవి మీనా అనే టీటీఈ చెకింగ్ కోసం ఎక్కాడు. ఈ సందర్భంగా ఆమె టికెట్ తీయలేదని గుర్తించి, ఫైన్ కట్టమన్నాడు. తన దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పడంతో, అలా అయితే పోలీస్ కేసు అవుతుందని, రైల్వే పోలీసులు తీసుకెళ్తారని బెదిరించాడు. అప్పటికే భీతావహురాలైన ఆమె నిస్సహాయతను అలుసుగా తీసుకుని రవి మీనా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మే 30న ఆమె జైపూర్ చేరుకున్న అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, అతను అత్యాచారానికి పాల్పడ్డాడని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News