: టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేశా: సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్
‘తదుపరి టీమిండియ్ కోచ్ ఎవరు’..? టీమిండియా అభిమానుల్లో, భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోన్న ప్రధాన చర్చ ఇది. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ ఈ పదవిని ఆశిస్తోన్న, అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన కూడా చేసింది. అయితే ఈ పదవి కోసం తాను కూడా దరఖాస్తు చేసినట్లు టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ చెప్పారు. తన పదవీ కాలం త్వరలోనే ముగియనుండడంతో సందీప్ పాటిల్ ఇకపై టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కోచ్ పదవిని ఆశిస్తోన్న విక్రమ్ రాథోడ్, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్పుట్, రుషికేష్ కనిత్కర్ జాబితాలో తాజాగా సందీప్ పాటిల్ కూడా చేరారు.