: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 14మంది మృతి


తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణ‌గిరి స‌మీపంలోని మేలుమ‌లైలో ఓ ప్రైవేటు బ‌స్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో వీటి వెనుక వస్తున్న మరో కారు కూడా ప్రమాదానికి గురైంది. ప్ర‌మాదంలో 14 మంది ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో 30 మందికి తీవ్ర‌గాయాలయ్యాయి. వీరిని కృష్ణ‌గిరి ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వేరుశ‌న‌గ‌ లోడుతో వెళుతోన్న లారీ మేలుమ‌లైలో ఒక్క‌సారిగా బస్సుని ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News