: చంద్రబాబునాయుడు డైనమిక్ ముఖ్యమంత్రి: కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైనమిక్ సీఎం అని కేంద్రమంత్రి సురేశ్ ప్రభు కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఏపీ రాష్ట్రాభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు తిరుపతి వెళ్తున్నానని, రేపు ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకుంటానని చెప్పారు. రేపు విజయవాడలో చంద్రబాబు సహా రైల్వే ఉన్నతాధికారులతో సమావేశమవుతానని, రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చిస్తానని సురేశ్ ప్రభు చెప్పారు.