: కేసీఆర్‌కి హరీశ్‌రావు పాదాభివందనం
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో ఈరోజు తన 44వ జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులు, పలువురు కార్యకర్తల నడుమ ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కి ఆయన పాదాభివందనం చేశారు. హరీశ్‌రావు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించాలని కేసీఆర్ ఆశీర్వదించారు. పుట్టిన రోజు వేడుక సందర్భంగా హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలపడానికి మంత్రులు, కార్యకర్తలు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.