: తెలంగాణ అని రాయడం కూడా రాని నువ్వా, విమర్శించేది?: దిగ్విజయ్ పై కేటీఆర్ ట్వీట్ బాణం


తెలంగాణ అన్న పదాన్ని ఇంగ్లీషులో సరిగ్గా రాయడం కూడా చేతగాని దిగ్విజయ్ సింగ్, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం ఏంటని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో "ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి 'తెలంగాణ' స్పెల్లింగ్ ను సరిగ్గా రాయడం రాదు. ఆయన సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారు" అంటూ పోస్టును ఉంచారు. కాగా, ఆవిర్భావ వేడుకల సందర్భంగా దిగ్విజయ్ విమర్శలు గుప్పిస్తూ, ప్రజలు కష్టాల్లో ఉంటే, వందల కోట్లతో పత్రికలకు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్, అక్కడి నుంచే దిగ్విజయ్ పై మండిపడ్డారు. దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలంగాణ స్పెల్లింగును 'telangana'కు బదులుగా 'telengana' అని రాయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News