: నియోజకవర్గం తగలబడిపోతుంటే... షూటింగ్ ఫొటోలను అప్ లోడ్ చేసిన మధుర ఎంపీ హేమమాలిని
ఉత్తరప్రదేశ్ లోని మధురలో భూ దురాక్రమణల తొలగింపు సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లతో ఆ నగరం తగలబడిపోతోంది. నిరసనకారులు, పోలీసులతో కొట్లాటకే దిగారు. ఈ ఘర్షణల్లో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు ఓ సీఐ స్థాయి అదికారి కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 22 మంది కూడా చనిపోెయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే మధుర పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి హేమమాలిని ఏం చేశారో తెలుసా? ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న తన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కూర్చుంది. ఈ మేరకు న్యూస్ ఏజన్సీ ఏఎన్ఐ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో వెనువెంటనే మేల్కొన్న హేమమాలిని సదరు ఫొటోలను తొలగించడంతో పాటు సంయమనం పాటించాలని తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.