: తన కోసం ఖర్చు చేసిన డబ్బు తిరిగి కట్టాల్సిందే.. బ్రేకప్ అయిన గర్ల్ ఫ్రెండ్ పై కేసు వేసిన ప్రేమికుడు
తన గర్ల్ ఫ్రెండ్ కోసం 600 యూఎస్ డాలర్లు ఖర్చు చేశానని, ఇప్పుడు ఆమె తనతో బ్రేకప్ అయిందని, ఆమె కోసం తాను ఖర్చు చేసిన డబ్బు తిరిగి తనకు చెల్లించాల్సిందేనని ఓ ప్రేమికుడు కోర్టులో కేసు వేసిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. తాము ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నో గిఫ్టులు ఇచ్చుకున్నామని, ఓ రోజు తన ప్రేమికుడితో బ్రేకప్ అయ్యానని, అనంతరం తన ఇంటికి కోర్టు నుంచి సమన్లు వచ్చాయని సదరు ప్రేమికురాలు అక్కడి మీడియాతో తెలిపింది. తనకు జారీ అయిన సమన్లలో తన ప్రేమికుడు తనకోసం ఖర్చు చేసిన 600 యూఎస్ డాలర్లు తిరిగి చెల్లించాలని ఉందని, దీనికి వ్యతిరేకంగా తాను కోర్టులో పోరాడుతున్నానని తెలిపింది. తన మాజీ ప్రేమికుడు తనపై రెండు కేసులు పెట్టాడని ఆమె పేర్కొంది. తనకు ఖర్చు చేసినట్లు అతను పలు బిల్లుల రిసిప్ట్‌లు కోర్టుకు చూపించాడని చెప్పింది.