: రాహుల్ గాంధీకి మేము అవసరం లేదనుకున్నా ఫర్వాలేదు: షీలా దీక్షిత్


రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి, సీనియర్ల స్థానంలో యువతతో తన టీమును నింపుకోవాలని భావిస్తే, దాన్ని స్వాగతిస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ఆయన కోరితే, పార్టీ సీనియర్ నేతలంతా తప్పుకోవడానికి సిద్ధమేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. "అది పార్టీ నిర్ణయం. రాహుల్ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. దీన్ని వెంటనే అమలు చేయాలి. మేమంతా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెంటే ఉంటాం. రాహుల్ కు పగ్గాలు అప్పగించాలని ఆమె నిర్ణయిస్తే, మేము శిరసావహిస్తాం" అన్నారు. బీహారులో మహాకూటమిలో చేరాలన్న ఆలోచన రాహుల్ గాంధీదేనని, ఆయన వ్యూహం విజయవంతమైందని షీలా దీక్షిత్ తెలిపారు. గతంలో రాహుల్ కంటికి కనిపించనంత చిన్న చిన్న తప్పులు చేశారని, వాటి నుంచి ఆయనెంతో పాఠం నేర్చుకున్నారని అభిప్రాయపడ్డారు. సీనియర్ల సేవలిక వద్దని ఆయన భావిస్తే, తామేమీ తప్పుగా అనుకోబోమని, పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము నిత్యమూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News