: మహిళా న్యాయమూర్తిని నోటికొచ్చినట్టు తిట్టిన ఓలా క్యాబ్ డ్రైవర్... అరెస్ట్


ఢిల్లీలో ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, మహిళల పట్ల, ముఖ్యంగా ఒంటరిగా వెళుతున్న వారి పట్ల క్యాబ్ డ్రైవర్లు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారని మరోసారి వెల్లడైంది. అయితే, ఈసారి బాధితురాలు ఎవరో ఐటీ ఉద్యోగో, లేకుంటే ప్రయాణం చేస్తున్న మహిళో కాదు. ఆమె ఓ న్యాయమూర్తి. తీస్ హజారీ కోర్టులో అడిషనల్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. తను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నోటికొచ్చినట్టు అసభ్యంగా తిట్టాడని, ఆమె చేసిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ ఢిల్లీలోని ఓ మార్కెట్ వద్ద షాపింగ్ కోసం వెళుతూ, క్యాబ్ ను వేచిచూడాలని కోరానని, దీంతో తనను తిట్టి, కారులోని బ్యాగును రోడ్డుమీదకు విసిరేశాడని ఆమె వివరించారు. మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల వైఖరి మారాల్సి వుందని అన్నారు.

  • Loading...

More Telugu News