: జగన్ కు పర్సనాలిటీ డిజార్డర్!: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు ఇదే కారణమంటున్న మంత్రి దేవినేని!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పర్సనాలిటీ డిజార్డర్ ఉందట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఆరోగ్యం బాగా లేదని, ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని దేవినేని సూచించారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు జగన్ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యం కుదుటపడేదాకా బెంగళూరుకో, ఢిల్లీకో వెళ్లి చికిత్స తీసుకుంటే మంచిదని జగన్ కు దేవినేని సూచించారు.