: తెలంగాణ పోరాడి సాధించుకున్నారు... కేసీఆర్ కు అభినందనలు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
తెలంగాణ పోరాడి సాధించుకున్నారని... కేసీఆర్ కు అభినందనలు తెలుపుతున్నానని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మాకు ఇష్టం లేకపోయినా విభజనను మాపై రుద్దారు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉన్నా చంద్రబాబు రుణమాఫీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు సీడబ్ల్యూసీ అనుమతి లేదు. రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు సర్వేకు జీవో ఇచ్చారు. రెండు రాష్ట్రాలు బాగుండాలన్నదే మా విధానం’ అని ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు.