: హైదరాబాద్ నుంచి పాలన ఆమోదయోగ్యం కాదని విజయవాడ వచ్చేశా: సీఎం చంద్రబాబు
హైదరాబాద్ నుంచి పాలన ఆమోదయోగ్యం కాదని భావించే విజయవాడ వచ్చానని, ఎన్ని కష్టాలున్నా ప్రజల కోసం భరిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశంలోని అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సు పార్టీయేనని ఆరోపించారు. అసోం, జమ్మూకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లకు కారణం కాంగ్రెస్సేనన్నారు. రాష్ట్ర విభజనతో ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దని ఆనాడే చెప్పానన్నారు. ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టలేదని, హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు విమర్శించారు.