: ఎమ్మెల్యేగా అంగూర్ లత ప్రమాణస్వీకారం చేస్తుంటే నోళ్లు వెళ్లబెట్టిన నేతలు!


అసోం అందాల సినీ నటి, భత్రదేవ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అంగూర్ లతా డెకా ప్రమాణ స్వీకారం చేస్తుంటే నేతలంతా నోళ్లు వెళ్లబెట్టి మరీ, చూశారు! ఎందుకంటే, ఎమ్మెల్యేగా ఆమె సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేయడమే! సంప్రదాయబద్ధమైన చీర కట్టులో నిన్న ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, దైవభాష అయిన సంస్కృతానికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు తాను కృషి చేస్తానని, సీఎం సోనోవాల్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంగూర్ లత, పదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నారు.

  • Loading...

More Telugu News