: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు


కోట్ల రూపాయల విలువ చేసే భూమి కబ్జా వ్యవహారంలో గుంటూరుకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీపై క్రిమినల్ కేసు నమోదైంది. నకిలీ డాక్యుమెంట్లతో సదరు భూమి యజమానిని మస్తాన్ వలీ బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు అర్బన్ పోలీసులకు భూమి యజమాని ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ అనంతరం మస్తాన్ వలీతో పాటు భూ కబ్జాకు సహకరించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను పోలీసులు బేఖాతర్ చేశారు. దీంతో, కోర్టు ధిక్కరణ కింద పోలీసులపై కేసు నమోదవడంతో వారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే మస్తాన్ వలీ, అతని అనుచరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News