: తెలంగాణ వ్యతిరేకి అయిన మోదీతో కేసీఆర్ రహస్య మంతనాలు: కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి
తెలంగాణ వ్యతిరేకి అయిన నరేంద్ర మోదీతో కేసీఆర్ రహస్య మంతనాలు సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ మంచి వ్యాపారి అని, లాభం ఉంటే తప్ప సోనియాగాంధీని పొగడరని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం నాడు కేసీఆర్ చేసిన దీక్ష దొంగదీక్షని, నిమ్స్ లో కేసీఆర్ ప్రతిరోజూ న్యూట్రిషన్ ఇంజక్షన్లు తీసుకున్నారని, ఇదంతా నిమ్స్ రికార్డుల్లో ఉందని ఆరోపించారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు.