: నా ప్రాణ సమానులైన ఐదు కోట్ల మంది ఆంధ్రులకు!... ప్రసంగం తీరు మార్చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన ప్రసంగం తీరును పూర్తిగా మార్చేశారు. మొన్నటిదాకా విషయాన్ని సూటిగా చెప్పడమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రసంగం తాజాగా భావోద్వేగాలను రేకెత్తించే విధంగానూ సాగుతోంది. కొద్దిసేపటి క్రితం విజయవాడలో నవ నిర్మాణ దీక్ష పేరిట చేపట్టిన కార్యక్రమానికి హాజరైన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రసంగం ప్రారంభంలోనే ‘‘నా ప్రాణ సమానులైన ఐదు కోట్ల మంది ఆంధ్రులకు...’’ అంటూ ఆయన సరికొత్త పదాన్ని వాడారు. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ నోటి నుంచే ఈ తరహా వ్యాఖ్యలు వినిపించేవి. తాజాగా వాటిని చంద్రబాబు కూడా ఔపోసన పట్టారు.