: కందుకూరు నుంచి బెజవాడకు క్యూ కట్టిన 200 వాహనాలు!... భారీ అనుచరగణంతో పోతుల పయనం
ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఓ 200 వాహనాలు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడకు కొద్దిసేపటి క్రితం బయలుదేరాయి. చీమల దండులా రోడ్డెక్కిన ఈ వాహనాలన్నీ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు వెనకాలే విజయవాడకు బయలుదేరాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు తాజాగా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికను స్వాగతించిన టీడీపీ శ్రేణులు కూడా ఆయన వెంట విజయవాడకు బయలుదేరాయి.