: బాబుది వెర్రిమొర్రి ఆలోచన... నయ వంచన దీక్ష ఇది: వైకాపా నిప్పులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని ఏకంగా నాలుగు లేఖలు ఇచ్చి సహకరించిన చంద్రబాబు, ఇప్పుడు నవ నిర్మాణ దీక్షలంటూ, రాష్ట్ర ప్రజలను నయవంచన చేస్తున్నారని వైకాపా ధ్వజమెత్తింది. కుట్ర రాజకీయాల మీద ప్రజలు పోరాడాలన్న దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం, ప్రజల తొలి లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వమే కానుందని ఆ పార్టీ ఓ ప్రకటనలో నిప్పులు చెరిగింది. ప్రజలు 11 గంటలకు ఎక్కడికక్కడ నిలిచిపోవాలని చెప్పడం, చంద్రబాబు వెర్రిమొర్రి ఆలోచనలకు నిదర్శనమని, ఎమర్జెన్సీని మించిన దుష్ట పోకడలకు బాబు సెంటర్ పాయింట్ అయ్యారని దుయ్యబట్టింది. గత రెండేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క పథకం కూడా ప్రజలకు దగ్గర కాలేదని విమర్శించింది. నేడు ఏం జరుగుతుందో చెప్పే ధైర్యం లేని చంద్రబాబు ప్రభుత్వం 2022, 2050 అంటూ అరచేతిలో వైకుంఠం చూపుతోందని, హిది హిట్లర్ ఆలోచనా ధోరణికి కొనసాగింపుగా జరుగుతున్న నాటకమని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News