: అన్యాయాన్ని నెమరు వేసుకుందాం, అవకాశాలను ఆలోచిద్దాం: పరకాల ప్రభాకర్
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టిన వారికి అసూయ, ఈర్ష్య కలిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచి చూపిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమ వేదికపై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారన్న కసిని, పట్టుదలగా మార్చుకొని అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళదామని పిలుపునిచ్చారు. ‘మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే నాయకత్వం మనకు దొరికింది, మంచి ప్రభుత్వం మనకు దొరికింది’ అని ప్రభాకర్ అన్నారు. ‘అన్యాయాన్ని నెమరు వేసుకుందాం, అవకాశాలను ఆలోచిద్దాం’ అని ఆయన అన్నారు. ‘ఒక సంకల్పాన్ని తీసుకుందాం, రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతిజ్ఞ చేద్దాం’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడున్నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞలో పాల్గొనాలని ఆయన కోరారు.