: పేకాట బృందంలో సీఐ... అవాక్కైన పోలీసులు!


ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...ఖమ్మం పోలీస్ స్టేషన్ కు ప్రశాంత్ నగర్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని, లక్షల్లో జూదం జరుగుతోందని ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీనిని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆ నివాసానికి చేరుకున్నారు. తీరా చూస్తే అది సీఐ ఇల్లు, ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు తన పేకాట బృందంతో పేకాడుతూ సీఐడీ సీఐ సదానిరంజన్, మరో ఏడుగురు రాజకీయ ప్రముఖులు దర్శనమిచ్చారు. దీంతో అవాక్కైన పోలీసులు తటపటాయించినా, వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి 1.77 లక్షల రూపాయలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News