: రిలీజ్ ఒత్తిడిలో నితిన్, సమంత ఏం చేస్తారో తెలుసా?


సినిమా రిలీజ్ అవుతోందంటే చాలా ఒత్తిడి ఫీలవుతామని నితిన్, సమంత తెలిపారు. 'అఆ' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, రేపు సినిమా రిలీజ్ అవుతుందని, ఇప్పటికే రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ మొదలైందని అన్నారు. రేపు మార్నింగ్ షో చూడాలని ఉందని, అయితే రేపటి వరకు ఒత్తిడికి తట్టుకోగలిగితే అభిమానులతో కలిసి చూస్తానని నితిన్ చెప్పాడు. తాను మాత్రం సినిమా హిట్టా, ఫట్టా అన్నది రిజల్ట్ వచ్చిన తరువాతే చూస్తానని సమంత చెప్పింది. అయితే సినిమా రిజల్ట్ వచ్చే వరకు విపరీతంగా తింటామని వారు చెప్పారు. ఫలానాది అని లేదని, ఒత్తిడిలో ఉంటే ఏం దొరికినా తింటామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News