: దీర్ఘకాలిక ఒత్తిడితో మెదడు ఆకారంలో మార్పులు
దీర్ఘకాలిక ఒత్తిడితో మన మెదడు అలసిపోవడం, డిప్రెషన్‌కు గురికావడం మాత్రమే కాదు దాని ఆకారంలోనూ మార్పులు వస్తాయని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. ఈ మార్పుల నుంచి మెదడును రక్షించడానికి పరిష్కారం కూడా కనిపెట్టినట్లు పేర్కొన్నారు. తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురైన ఎలుకలో భయం, ఆత్రుత వంటి భావాలకు కారణమయే మెదడు భాగం అమిగ్డాలా ముడుచుకుపోయి కనిపించినట్లు కనుగొన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. మెదడు భాగాలతో అనుసంధానమై ఉండే న్యూరాన్(నాడీ కణ) శాఖలు కూడా కుదించుకుపోయినట్లు వెల్లడైందని చెప్పారు. ఇటువంటి మార్పులు మెదడుకు హాని చేస్తాయని పేర్కొన్నారు. అయితే నరాల వ్యవస్థలో మార్పులు, ప్రవర్తనా రీతుల్లో మార్పులకు దానిపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీడిప్రెసెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చి నయం చేయొచ్చని చెప్పారు.