: 48 గంటల నిరసన దీక్ష చేపడతా: రేవంత్ రెడ్డి
కొమురవెల్లి మల్లన్న సాగర్ డ్యాము నిర్మాణంతో తమ భూములు లాక్కుంటున్నారంటూ మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రజలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. చావడానికైనా సిద్దం, మా భూములు ఇవ్వబోమంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అండగా నిలుస్తామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోతున్న వారికి పరిహారం ఇవ్వాలని ఈరోజు ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారికి ఎకరానికి రూ.25లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 15వ తేదీలోగా భూనిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఏటిగడ్డ కిష్టాపూర్లోనే 48 గంటల నిరసన దీక్ష చేపడతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.