: ‘భారతరత్న’తో చిరు, నాగ్ ల సెల్ఫీ!
క్రికెట్ లెజెండ్ సచిన్ తో కలిసి నలుగురు ప్రముఖులు దిగిన ఒక అరుదైన సెల్ఫీ ఇది. సచిన్ టెండూల్కర్, తెలుగు హీరోలు చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లు ఈ సెల్ఫీలో ఉన్నారు. తిరుపతిలో దిగిన ఈ సెల్ఫీలో వాళ్లందరూ పసుపుపచ్చ చొక్కాలతో కనపడుతున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్న విషయం తెలిసిందే.