: కొత్త పన్ను మోతతో నేటి నుంచి ఖరీదైనవివే!


దేశంలోని రైతుల సంక్షేమం కోసమంటూ, రూ. 20 వేల కోట్లను ఖజానాకు చేర్చే లక్ష్యంతో, కేంద్రం కృషి కల్యాణ్ సెస్ (కేకేసీ) పేరిట కొత్త పన్నును నేటి నుంచి వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్లు, సిగరెట్లు, బ్రాండెడ్ దుస్తులు, విమాన ప్రయాణం వంటి వాటికి ఎన్నింటికో అదనంగా జేబును ఖాళీ చేసుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే 14.5 శాతం ఉన్న సేవా పన్ను, ఈ కేకేసీ కారణంగా 15 శాతానికి చేరుకుంది. బయటి హోటళ్లలో తిన్నా, ఫోన్లు వాడినా, రైలెక్కినా, సినిమా చూడటం వంటి ఏ పని చేసినా భారం పడుతుంది. ఇక ఎలాంటి బిల్లు చెల్లింపులు జరిపినా, రూ. 1000కి మించిన దుస్తులు కొనుగోలు చేసినా, బంగారు ఆభరణాలు కొన్నా, మినరల్ వాటర్ తాగినా, ప్లాస్టిక్ బ్యాగులు, సాక్సులు వాడినా, కాసేపు ఆహ్లాదం కోసం పార్కుకో లేదా ఎగ్జిబిషన్ కో వెళ్లినా, రోల్డ్ గోల్డ్ ను దిగుమతి చేసుకున్నా, ఇంటర్నెట్ వాడినా, కోర్టు కేసుల నిమిత్తం న్యాయవాది సేవలు అందుకున్నా ఈ కేకేసీ భారాన్ని మోయాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News