: సోనియాజీ కంగారొద్దు!.. మరో 15 ఏళ్లు ప్రధానిగా నరేంద్ర మోదీనే!: కేంద్ర మంత్రి పాశ్వాన్
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర ప్రకటన చేశారు. జమ్మూలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై పాశ్వాన్ ఘాటుగా స్పందించారు. మరో 15 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉండబోతున్నారని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా పాశ్వాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధాని మోదీని ‘షెహన్ షా’ అంటూ సోనియా సంబోధించడం సరికాదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.