: చదువుకోవద్దని కొడుతున్నారు.. కృష్ణా జిల్లాలో తల్లిదండ్రులపై పోలీసులకి చిన్నారుల ఫిర్యాదు
తమని చదువుకోనివ్వకుండా పనికి వెళ్లమంటున్నారని తల్లిదండ్రులపై పిల్లలు ఫిర్యాదు చేసిన ఘటన కృష్ణా జిల్లాలోని వీరవల్లిలో చోటుచేసుకుంది. ‘మమ్మల్ని చదువుకోనివ్వం లేదు.. అమ్మ, నాన్న దగ్గర ఉండడం మాకు ఇష్టం ఉండదు’ అంటూ కనీసం పన్నెండేళ్లు కూడా నిండని ఓ బాలిక తన తమ్ముడితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. తమ తల్లి, తండ్రి తమను కొడుతున్నారని తాతయ్య, అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంటామని ఇద్దరు చిన్నారులు మీడియాకి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకి వ్యతిరేకంగా ఉండబోరని, కానీ తమ తల్లిదండ్రులు తాము చదువుకుంటామంటే దానికి నిరాకరిస్తున్నారని చెప్పారు.