: అన్ని నామినేషన్లూ ఓకే అన్న భన్వర్ లాల్... నేడే ఏకగ్రీవ ప్రకటన!
తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లన్నీ నిబంధనల ప్రకారం సక్రమంగానే ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఉదయం నామినేషన్ల పరిశీలన జరుగగా, వాటిని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ సరైనవేనని ధ్రువీకరించారు. అన్నింటినీ ఆమోదించినట్టు వివరించారు. కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది కాబట్టి, అప్పటిదాకా వేచి చూసి, ఎవరూ ఉపసంహరించుకోకుంటే, ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కాగా, ఏపీ నుంచి తెలుగుదేశం అభ్యర్థులుగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ - టీడీపీ అభ్యర్థిగా సురేష్ ప్రభు, వైకాపా అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్లు వేయగా, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ తరఫున డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.