: తిరుపతి టూ తిరువనంతపురం... కేరళ సీఎంతో చిరంజీవి, నాగార్జున, సచిన్ ప్రత్యేక భేటి


ఈ ఉదయం తిరుపతిలో వెంకన్నను దర్శించుకున్న టాలీవుడ్ స్టార్లు నాగార్జున, చిరంజీవి, క్రికెటర్ సచిన్ ను ఎందుకు కలిశారో తెలిసిపోయింది. కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని ప్లాన్ వేసుకున్న ముగ్గురూ, అక్కడి సీఎం పినరాయి విజయన్ అపాయింట్ మెంట్ తీసుకుని, అంతకుముందుగా స్వామి దర్శనానికి వచ్చారు. ఈ ఉదయం దర్శనానంతరం రేణిగుంట విమానాశ్రయానికి అక్కడి నుంచి చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్న వీరు, కేరళ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వీరికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి విజయన్, అకాడమీ ఏర్పాటుపై వారితో చర్చించారు. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లు కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టుకు యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. విజయన్ ను కలిసిన వారిలో అల్లు అరవింద్, నిమ్మగడ్డ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News