: ఆల్ రౌండర్లలో అగ్రస్థానం అశ్విన్ దే!... టెస్టు ర్యాంకుల్లో సత్తా చాటిన చెన్నై కుర్రాడు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిన్న ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. బౌలర్ గానే తెరంగేట్రం చేసిన ఈ చెన్నై కుర్రాడు... క్రమంగా బ్యాటింగ్ లోనూ రాటు తేలాడు. నిన్న ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకులే నిదర్శనం. టెస్టు ర్యాంకింగ్స్ లో బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అశ్విన్... ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆల్ రౌండర్ గా 406 పాయింట్లు సాధించిన అశ్విన్ అగ్ర స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మాత్రమే అశ్విన్ కంటే ముందున్నాడు.