: జూన్ 8న చంద్రబాబుపైన, ఆయన కేబినేట్ పైనా కేసులు పెడతాం: వైఎస్సార్సీపీ నేత బొత్స
జూన్ 8వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్ పై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టే కార్యక్రమాన్ని చేపడతామని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అన్ని విధాలుగా విఫలమైన చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసగించిందని ఆయన ఆరోపించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 8వ తేదీనేని, అందుకే, అదే తేదీన ఈ కార్యక్రమం చేపట్టాలని తాము నిర్ణయించామని, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.