: రెండోసారి రాజ్యసభకు వెళ్తుండటంతో నా బాధ్యత మరింత పెరిగింది: సుజనా చౌదరి


రెండోసారి రాజ్యసభకు వెళ్తుండటంతో తన బాధ్యత మరింత పెరిగిందని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని టీడీపీ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్రప్రదేశ్ గురించి పోరాడిన రోజులు వేరని, ఇప్పుడు ఏపీకి కావాల్సిన వసతులు, రాష్ట్రానికి చట్టపరంగా ఏం చేయగలం అన్నదానిపై దృష్టి పెడతామని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా అప్పటికి, ఇప్పటికీ తేడా ఏమిటంటే, అప్పుడు కొత్త అని, ఇప్పుడు అనుభవం ఉందని, గతంలో కంటే మెరుగ్గా పనిచేస్తానని అన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య భేదాభిప్రాయాల విషయమై ఆయన్ని ప్రశ్నించగా, అన్నదమ్ముల మధ్య కూడా భేదాభిప్రాయాలు తప్పవని, కలిసికట్టుగా పనిచేస్తామని... చేస్తున్నామని, ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని సుజనా చౌదరి చెప్పారు.

  • Loading...

More Telugu News