: ప్రజా జీవితంలో లేని వ్యక్తిని రాజ్యసభకు ఎలా పంపుతారు?: జగన్ ను ప్రశ్నించిన జ్యోతుల


ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీపై ఎంతో బాధ్యత ఉండేదని, తాజా ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. హైదరాబాదులో భూమా నాగిరెడ్డితో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా, ప్రజా జీవితంలో లేని వ్యక్తిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. పార్టీలో ఎమ్మెల్యేలను కట్టుబానిసలుగా భావించడం సమంజసమా? అని ఆయన నిలదీశారు. ప్రజాప్రతినిధుల భావాలకు ప్రతిపక్షంలో విలువ ఇవ్వరా? అని ఆయన అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష భావజాలంతో రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. తాము ప్రతిపక్ష నేతను సరైన దారిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ మారామని, అయినప్పటికీ ఆయన బుద్ధి మారడం లేదని ఆయన మండిపడ్డారు. జగన్ ఆరోపిస్తున్నట్టు తమకు డబ్బులు ముట్టలేదని ఆయన తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను చూసిన తాము, ఇలాంటి వ్యక్తిని మాత్రం చూళ్లేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News