: విమానంలో బాలికపై లైంగిక వేధింపులు, బీజేపీ నేత అరెస్ట్
విమానంలో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై గుజరాత్ బీజేపీ నేత అశోక్ మక్వానాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గోవాలో వేసవి సెలవులను ముగించుకున్న 13 ఏళ్ల బాలిక తిరుగు ప్రయాణంలో ఇండిగో విమానం ఎక్కగా, పక్క సీట్లో అశోక్ మక్వానా కూర్చున్నారు. ప్రయాణ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. ఇంటికి చేరుకున్న తరువాత, తన పక్కన కూర్చున్న ఓ వ్యక్తి వేధించాడని తల్లిదండ్రులకు చెప్పింది. వారి సాయంతో సర్దార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎయిర్ లైన్స్ నుంచి పక్కన కూర్చున్న వారెవరో తెలుసుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.