: కోహ్లీని మేమంతా ఇష్టపడతాం, ఎందుకంటే...: హేడెన్
టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీని తామంతా ఎందుకు ఇష్టపడతామంటే...అతని ఆటతీరు తమను పోలి ఉంటుందని ఆసీస్ వెటరన్ మాధ్యూహేడెన్ అన్నాడు. ఐపీఎల్ వ్యాఖ్యాతగా పని చేసిన మాథ్యూహేడెన్ తాజాగా మాట్లాడుతూ, దూకుడుగా ఆడడం కోహ్లీ స్టైల్ అన్నాడు. టెక్నిక్, పవర్, దూకుడు, నిలకడ కలగలిపి కోహ్లీ ఆడుతాడని, ఈ ఆటతీరు ఆస్ట్రేలియన్లను పోలి ఉంటుందని చెప్పాడు. అందుకే అతని ఆటతీరును తామంతా ఇష్టపడతామని చెప్పాడు. అదే అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని హేడెన్ పేర్కొన్నాడు. అయితే కోహ్లీ అంత అద్భుతమైన ఆటగాడైనప్పటికీ వార్నర్ అంత పవర్ ఫుల్ ఆటగాడు కాదని తేల్చేశాడు. వార్నర్ శక్తిమంతమైన ఆటగాడని హేడెన్ కితాబునిచ్చాడు.