: బైకులు ఎందుకు తగలబెడుతున్నాడో విని విస్తుపోయిన పోలీసులు


ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బైకులు తగలబడిపోతున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. సహజంగా బైకు దొంగతనాలు జరగడం సర్వసాధారణం. కానీ, బైకులు ఎందుకు తగులబడిపోతున్నాయో అర్ధం కాని పోలీసులు దర్యాప్తు చేసినా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మే 28న ఎప్పట్లా ఒక బైకు తగులబడింది. మంటలు ఆపేందుకు స్థానికులు నానా తంటాలు పడ్డారు. చిత్రమేంటంటే బైకుకు నిప్పు పెట్టిన వ్యక్తి కూడా ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం విశేషం. ఈ దృశ్యాలు మొత్తం సీసీ పుటేజ్ లో నిక్షిప్తం కావడంతో పోలీసులు బైకుకు నిప్పుపెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆరాతీయగా, పలు విషయాలు వెల్లడించాడు. తన పేరు సునీల్ కిశోర్ అని, దినసరి కూలిగా పనులు చేస్తుంటానని చెప్పాడు. తనకు బైకులంటే చాలా ఇష్టమని, అయితే వాటిని కొనుక్కునే స్తోమత లేదని, వాటిని దొంగతనం చేస్తే దొరికిపోయే ప్రమాదం ఉంది కనుక, తనకు లేని బైకులు ఇతరులకు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే వాటిని తగులబెడుతున్నానని ఆయన చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ తిన్నారు.

  • Loading...

More Telugu News