: ఓడినా... గెలిచినా పార్టీనే!... క్రిస్ గేల్ రూటే సెపరేటు!
ఓ పార్టీ చేసుకోవాలంటే స్నేహితులుండాలి. ఆనందంగా గంతులేయాలంటే నలుగురు చుట్టూ ఉండాలి. కానీ విధ్వంసకర బ్యాట్స్ మెన్, తన నోటి దురుసుతో సమస్యలు కొని తెచ్చుకునే క్రిస్ గేల్ కు ఇవేవీ అవసరం లేదు. క్రికెట్ ఆటలో గెలిచినా, ఓడినా తనకు పట్టదు. జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆనందించాలని చెబుతుండే గేల్, ఐపీఎల్ ఫైనల్ పోరులో ఓడిపోయిన విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు. పార్టీ చేసుకునేందుకు టీం సభ్యులు ఎవరూ రాకపోగా, తానొక్కడే ఒంటరిగా పార్టీ చేసుకున్నాడు. డ్యాన్స్ ఫ్లోర్ పై ఇరగదీశాడు. గేల్ తో పాటు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నప్పటికీ, అతను కేవలం గేల్ డ్యాన్స్ ను మాత్రమే చూస్తూ ఉండిపోయాడట. ఇక తన ఒంటరి పార్టీ వీడియోను గేల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. "నిన్న ఇండియాలో డ్యాన్స్ చేశా, నేడు లండన్ లో చేస్తా. మిస్ యూ సర్ఫరాజ్.. దృఢంగా ఉండు. నా నృత్యం చూసి పాఠాలు నేర్చుకో" అని ట్యాగ్ లైన్ పెట్టాడు.