: నా తల్లిదండ్రులు, కాబోయే భర్తకు తప్ప మిగిలినవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: ప్రియమణి
సోషల్ మీడియాలో అభిమానుల తీరుపై సినీ నటి ప్రియమణి మండిపడుతోంది. పలు భాషా చిత్రాలలో నటించిన ప్రియమణి త్వరలో తన ప్రియుడు, చెన్నై వ్యాపారి ముస్తఫారాజ్ ను వివాహం చేసుకోనుంది. ఈ మేరకు అతనితో నిశ్చితార్థం జరిగిన ఫోటోలను పోస్టు చేసి, తన వివాహం గురించి ట్వీట్ చేసింది. దీనిపై కొంత మంది సానుకూలంగా స్పందించగా, మరికొందరు విమర్శలు గుప్పించారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియమణి, ట్విట్టర్ లో ఘాటుగా స్పందించింది. తమను ఆశీర్వదిస్తారని, తమకు మద్దతు తెలుపుతారని తన నిశ్చితార్థం ఫోటోలను పోస్టు చేశానని చెప్పింది. తన తల్లిదండ్రులు, కాబోయే భర్తకు తప్ప ఇంకెవరికీ తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.