: 2016 ఐపీఎల్ లో కోహ్లీ సాధించిన రికార్డులివే


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 ఐపీఎల్ తో సరికొత్త రికార్డులు సృష్టించాడు. తాజా ఐపీఎల్ లో 16 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఒక ఐపీఎల్ లో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగులివే. ఈ రికార్డును కోహ్లీ తన పేరిట లిఖించుకోగా, ఇందులో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం. ఒక టీట్వంటీ టోర్నీలో ఒకే అటగాడు నాలుగు సెంచరీలు ఇంతవరకు నమోదు చేయలేదు. ఇది మరో రికార్డు. ఇకపోతే తాజాగా సాధించిన పరుగులతో ఇప్పటి వరకు ఐపీఎల్ లో కోహ్లీ మొత్తం 4110 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వ్యక్తిగా కోహ్లీ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇంతవరకు ఈ రికార్డు సురేష్ రైనా (4.098) పేరిట ఉండేది.

  • Loading...

More Telugu News