: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. రాజ్యసభకు నామినేట్ అయ్యే అభ్యర్థుల పేర్లను తేల్చేందుకు రావాలని స్వయంగా చంద్రబాబు పిలవడంతో కేంద్ర మంత్రులు అశోక గజపతిరాజు, సుజనా చౌదరిలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు వచ్చారు. రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన వారిపై ప్రధానంగా చర్చ జరుగుతుండగా, ఆశావహుల పేర్లన్నీ ఓసారి పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న ఒక్కో నేత అర్హతలను ఆయన వింటున్నారు. నేడు అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News