: కుర్చీపై పయ్యావుల... పక్కనే కింద గొంతుక్కూర్చుని నారా లోకేశ్!: మహానాడులో అరుదైన దృశ్యం


టీడీపీ వార్షిక వేడుక మహానాడులో నిన్న ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేశ్ మహానాడు ప్రారంభం రోజున లాస్ట్ బెంచ్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత రెండు, మూడో రోజు సమావేశాల్లో రెండో వరుసకు మారిన ఆయన పలువురు నేతలతో ఉల్లాసంగానే కాకుండా సీరియస్ చర్చల్లోనూ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తో చర్చ సందర్భంగా లోకేశ్ కింద కూర్చున్నారు. మహానాడు వ్యాఖ్యాత బాధ్యతల్లో ఉన్న పయ్యావుల తొలి వరుసలోనే కూర్చున్నారు. ఏదో అంశంపై ఆయనతో చర్చించేందుకు వచ్చిన లోకేశ్... పయ్యావుల కూర్చున్న కుర్చీపై చేయి వేసి దాని పక్కనే గొంతుక్కూర్చున్నారు. ఓ పేపర్ పై రాసి ఉన్న అంశాన్ని చూపిస్తూ ఆయన పయ్యావులతో చాలా సేపే చర్చించారు. కుర్చీపై పయ్యావుల, ఆ పక్కనే నారా లోకేశ్ కింద కూర్చున్న సదరు దృశ్యాన్ని మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు.

  • Loading...

More Telugu News