: జగన్ కు దోషం అంటే అవకాశం లేదు: కేవీపీ కీలక వ్యాఖ్యలు


ఓవైపు జగన్ గురించి మాట్లాడను, అడగద్దు అంటూనే ఆయన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కేవీపీ రామచంద్రరావు. అక్రమాస్తుల కేసులో జగన్ దోషని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. "కాదండీ... దానికి మీరెవరు? నేనెవరు? దానికి మీకేం హక్కుంది? నాకేం హక్కుంది? జగన్ మోహన్ రెడ్డి దోషా? నిర్దోషా? చెప్పడానికి చట్టాలు ఉన్నాయి. కోర్టులు ఉన్నాయి. కేసులన్నీ కోర్టు పరిగణనలో ఉన్నాయి. నాయొక్క పర్సనల్ అభిప్రాయం ప్రకారం, జగన్ మోహన్ రెడ్డికి దోషం అంటడానికి అవకాశం లేదు. కానీ నా అభిప్రాయాన్ని ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోదు" అని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తనపై కేసులు పెట్టించిందని జగన్ ఆరోపిస్తున్నారు కదా? అని గుర్తు చేయగా, 'నేను ఈ టాపిక్ పై మరొక్క మాట కూడా మాట్లాడను. ప్రత్యేక రాష్ట్రం, హోదా గురించి మాత్రమే మాట్లాడండి' అని అన్నారు. ఇది టీవీ-9 చానల్ లో 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ' కార్యక్రమంలో భాగంగా కేవీపీతో ముచ్చటిస్తున్న వేళ చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News