: సీఎం కేసీఆర్ ను కలిసిన డీఎస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్ కలిశారు. ఈరోజు హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చించినట్లు సమాచారం. కాగా, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా డీఎస్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31న రాజ్యసభకు డీఎస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. డీఎస్ తో పాటు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కూడా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.