: ఒక పేపర్ తప్ప, అందరూ చాలా బాగా కవర్ చేశారు : నవ్వులు చిందించిన చంద్రబాబు
"తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన మహానాడు కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అద్భుతంగా కవర్ చేశారు, ఒక పేపర్ తప్ప" అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఢిల్లీ నుంచి వచ్చారు.. హైదరాబాద్ నుంచి వచ్చారు... అమరావతి నుంచి వచ్చారు... స్థానిక మీడియా వచ్చింది, ఒక పేపర్ తప్ప అందరూ కూడా చాలా బాగా కవర్ చేశారు. ఆ పేపర్ రూటే వేరు... మన రూటే వేరు’ అంటూ 'సాక్షి' పత్రికను పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నవ్వులు చిందించారు.