: కొత్త సమస్య... తాను నిరపరాధినంటూ కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్న హరీశ్ రావత్
ఇటీవల తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల గురించి స్పందిస్తూ, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలకు ఇచ్చిన ప్రకటనలు ఆయనకు కొత్త సమస్యను తెచ్చి పెట్టాయి. దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ లను ఇస్తూ, తాను నిర్దోషినని, ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ప్రజలు తనకు అండగా నిలబడాలని కోరారు. ఓ కుట్రతో తనను ఇరికించారని పేర్కొన్నారు. సీబీఐ విచారణకు రావత్ హాజరు కావడానికి ముందు రోజు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈ యాడ్ ను విడుదల చేసింది. కాగా, ఈ ప్రకటనతో ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్టు స్పష్టమైందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని విమర్శించిన బీజేపీ, రావత్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది.